
బంజారాహిల్స్ ప్రాపర్టీకి సంబంధించి తమ దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయన్నారు టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు విశ్వ ప్రసాద్. ప్రాపర్టీ టైటిల్స్ వేరిఫై చేసుకొని అందులో 20 శాతం కొనుగోలు చేశామన్నారు. మిగతా 70 శాతం డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. ల్యాండ్ పై అన్ని అనుమతులు ఉన్నాయని కోర్టు ఆర్డర్ తర్వాత డెవలప్ మెంట్ కోసం వెళ్తే... ఓ గ్రూప్ వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు విశ్వ ప్రసాద్. ఆ టైంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లామన్నారు. అయితే తమ డాక్యుమెంట్స్ చూడకుండానే తమకు వ్యతిరేకంగా పోలీసులు FIR నమోదు చేశారన్నారు. పోలీసులు అక్కడ ఉన్నవాళ్లను రిమాండ్ లోకి తీసుకొని తప్పుడు కేసులు పెట్టారన్నారు. విశ్వ ప్రసాద్ పరారీలో ఉన్నాడన్న మాట అవాస్తవమన్నారు. తాను అమెరికాలో ఉన్నానని... టీజీ వెంకటేష్ కు ఈ అంశంతో సంబంధం లేదన్నారు.