డ్రగ్స్ నియంత్రణ పోస్టర్ ఆవిష్కరణ

డ్రగ్స్ నియంత్రణ పోస్టర్ ఆవిష్కరణ

ఆర్మూర్, వెలుగు : టీజీఏఎన్ బీ  వారు డ్రగ్స్ నియంత్రణ కోసం రూపొందించిన అవగాహన పోస్టర్​ను ఆదివారం ఆర్మూర్ లో ఆవిష్కరించారు. ఆర్మూర్ టౌన్ కు చెందిన సామాజిక సేవకులు పట్వారీ తులసీకుమార్, ఏసీపీ ఆఫీస్ లో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్సై శ్రీధర్ రెడ్డి తో కలిసి పోస్టర్​ను ఆవిష్కరించారు. 

ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నిర్వహించే ఏ కార్యక్రమానికైనా తప్పకుండా సహకరిస్తామన్నారు.  మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా విద్యార్థులు ఉన్నత చదువులు చదువాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.