
కుంటాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా టీజీబీ బ్యాంక్ పని చేస్తోందని చైర్పర్సన్ శోభ అన్నారు. మంగళవారం కుంటాల మండల కేంద్రంలో భారత్ సంకల్ప వికసిత్ యాత్ర సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్, ఆయుష్మాన్ భవా, స్వచ్ఛమైన తాగునీరు
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఇంటింట ఆరోగ్యం లాంటి పథకాల అమలు, ప్రయోజనాల గురించి ఆమె మహిళలకు వివరించారు. బ్యాంక్ ద్వారా వ్యక్తిగత రుణాలు, రైతులకు పావలా వడ్డీతో పంట రుణాలు, తదితర బ్యాంక్ పథకాలను వివరించారు. ఆర్ఎం రామారావు, ఎల్ డీఎం చంద్రశేఖర్, ఏపీఎం అశోక్, బ్రాంచి మేనేజర్ సంతోష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.