ఐదు నెలల్లో రూ.85.05 కోట్లు రికవరీ..!

ఐదు నెలల్లో రూ.85.05 కోట్లు రికవరీ..!

సైబర్ అటాక్​బారినపడ్డ తర్వాత వారి చేతుల్లోకి వెళ్లిన సొమ్ము తిరిగి బాధితుని వద్దకు రావడం చాలా కష్టం. చాలా మంది అనేక రకాల సైబర్​ దాడుల్లో కోట్ల రూపాయల సొమ్మునే పోగొట్టుకున్నారు. సైబర్​ దొంగలు చేస్తున్న ఈ ఘరానా మోసాలను ఒక్కోసారి పోలీసులు కూడా కనుక్కోలేకపోతున్నారు. ఇలా సైబర్ మోసాలు బాధితులు ఈ ఆధునిక సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్నారు. అనునిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర సైబర్​ దాడి జరుగుతుంది. ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్​ బాబులు బాగా రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు ఇలాంటి వారిని గుర్తించడం కఠినంగానే ఉండేది కానీ వారితో పాటు పోలీసులు కూడా కొత్త పంథాలను ఎంచుకోవడంతో ఇలాంటి దాడులకు పాల్పడేవారిని గుర్తించి వారి నుంచి సొమ్మును దాదాపుగా రికవరీ చేస్తున్నారు. 

ముఖ్యంగా సైబర్​ నేరాల్లో బాధితుల నుంచి నేరగాళ్లు కాజేసిన సొమ్మును తిరిగి తీసుకొచ్చేందుకు తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత ఐదు నెలల (మార్చి - జూలై) వ్యవధిలో తెలంగాణ లీగల్​ సర్వీసెస్​ అథారిటీతో కలిసి పోగొట్టుకున్న బాధితుల సొమ్ము రూ.85.05 కోట్లు, అందులో సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోవే రూ.36.8 కోట్లు తిరిగి బాధితులకు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు సైబర్​ నేరాలకు సంబంధించి దీర్ఘకాలంగా బ్యాంకుల వద్ద నిలిచిపోయిన బాధితుల సొమ్మును లోక్​ ఆదాలత్​ ద్వారా కూడా వారికి ఇప్పించినట్లు తెలిపారు.

సైబర్​ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న సొమ్మును వారి ఫిర్యాదు ద్వారా ఫ్రీజ్​ చేసిన తర్వాత వాటిని 457 సెక్షన్​ కింద దర్యాప్తు అధికారి కోర్టులో పిటిషన్​ ఫైల్​ చేస్తే కోర్టుల అనుమతితో వాటిని బాధితులకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందన్నారు. కేవలం హైదరాబాద్​లోనే కాకుండా అన్ని జిల్లాల్లో కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇలా ఇప్పటివరకు 6,449 పిటిషన్లకు సంబంధించిన రూ.85.05 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా పోలీసులు, న్యాయ వ్యవస్థ కలిసి ఆర్థిక సైబర్​ నేరాల్లో బాధితులకు న్యాయం చేకూర్చుతోందని అధికారులు​ వెల్లడించారు.

గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత

సైబర్ సెక్యూరిటీ బ్యూరో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత తెలిపింది.  సొమ్ము కోల్పోయిన బాధితులు మోసం గుర్తించిన వెంటనే లేదా గంటలోపు పోలీసులను సంప్రదించాలి. దీంతో పోలీసులు నిందితుడి బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేసి బాధితులకు రీఫండ్‌ చేసే అవకాశం ఉంటుంది.  మోసపోయిన బాధితులు 1930కి కాల్ చేసి లేదాCYBERCRIME.GOV.IN పోర్టల్‌ని సందర్శించి కంప్లయింట్ చేయవచ్చు. చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఎప్పుడూ వీడియో కాల్‌లు చేయవని.. ధృవీకరణ నిరూపించుకోవడం కోసం ఏదైనా ఖాతాకు డబ్బును బదిలీ చేయమని ఆదేశించదని TGCSB తెలిపింది.