పాత పద్ధతిలోనే ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలి

పాత పద్ధతిలోనే ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలి
  • ఉన్నత విద్యా మండలి చైర్మన్ కు టీజీడీఏ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో చేపట్టే ప్రొఫెసర్ల రిక్రూట్ మెంట్ ను పాతపద్ధతిలోనే చేపట్టాలని ప్రభుత్వాన్ని తెలంగాణ స్టేట్ డాక్టరేట్స్ అసోసియేషన్(టీజీడీఏ) కోరింది. స్క్రీనింగ్ టెస్టుల పేరుతో వివాదాస్పదం చేయకుండా యూజీసీ నిబంధనల మేరకే రిక్రూట్ మెంట్ ప్రక్రియను చేపట్టాలని సూచించింది.

శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలక్రిష్టా రెడ్డిని అసోసియేషన్ మాజీ అధ్యక్షడు డాక్టర్ పొలాడి రమణరావు, అధ్యక్షుడు డాక్టర్ పి. నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ బొల్లం తిరుపతి, డాక్టర్ ధాత్రిక స్వప్న, అధికార ప్రతినిధులు డాక్టర్ రవి తేజ, డాక్టర్  తిరుపతి, డాక్టర్ వినయ్, డాక్టర్  స్వామినాయక్ కలిసి  వినతి పత్రం ఇచ్చారు.

ప్రొఫెసర్ల రిక్రూట్ మెంట్ పై కొంత మంది ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చైర్మన్ ధృష్టికి తీసుకెళ్లారు. అమలు కావడానికి వీలులేని సూచనలు, సలహాలు ఇచ్చి రిక్రూట్ మెంట్ లో వివాదాలు వచ్చేలా  చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీలో ప్రొఫెసర్ల నియామక విధానంపై నియమించిన త్రిమెన్ కమిటీలోని ఓ ప్రొఫెసర్ ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిసిందని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.