టీజీడీసీఏ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఈ నెల 29న పోలింగ్

టీజీడీసీఏ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. ఈ నెల 29న పోలింగ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం (టీజీడీసీఏ) ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల (సెప్టెంబర్) 29న టీజీడీసీఏ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కాగా, 2010లో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం.. జూలై 31 2012న జారీ చేయబడిన 411 జీవో ప్రకారం గుర్తింపు పొందింది. 2014 వరకు ఈ సంఘానికి ఎన్నికలు జరిగాయి. అయితే, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా విడిపోయింది. అప్పటి నుండి ఎన్నికలు నిలిచిపోగా.. ఈ వివాదం కోర్టుకెక్కింది. 

ALSO READ | మెడికల్​ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నీషియన్స్

ఈ ఇష్యూపై విచారణ చేపట్టిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గుర్తింపు ఎన్నికల షెడ్యూల్‎ను ఫిక్స్ చేసింది. దీని ప్రకారం.. సోమవారం (సెప్టెంబర్ 16) ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుండగా..  సెప్టెంబర్16-, 19 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. 20వ తేదీన నామినేషన్ల స్క్రూటీని, 21న నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అనంతరం సెప్టెంబర్ 29న ఓల్డ్ స్టూడెంట్స్ గెస్ట్ హౌస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. జీఎం మొహియుద్దీన్, ప్రశాంత్‌లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా హైకోర్టు నియమించింది.