
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీలో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కు దరఖాస్తు గడువు ముగిసింది. గురువారం నాటికి 3,06,796 దరఖాస్తులు వచ్చాయని ఎప్ సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీంట్లో ఇంజినీరింగ్ స్ర్టీమ్ లో 2,20,049 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ లో 86,493, రెండింటికీ 254 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు.
రూ.5వేల ఫైన్ తోనూ గురువారంతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే, ఉమ్మడి అడ్మిషన్లకు పదేండ్ల కాలం పూర్తికావడంతో, ఈసారి ఏపీ నుంచి ఎక్కువ మంది అప్లై చేసుకోలేదు. దీంతో గతేడాదితో పోలిస్తే స్వల్పంగా అప్లికేషన్లు తగ్గాయి. అయితే, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ర్టీమ్ అభ్యర్థులకు ఈ నెల 29,30 తేదీల్లో, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ స్ర్టీమ్ కు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే వెబ్ సైట్ లో పెట్టారు.