40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలు ఇస్తం : ముత్తినేని వీరయ్య

40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలు ఇస్తం : ముత్తినేని వీరయ్య

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ పాల నలో అవినీతి జరిగిన వికలాంగుల కార్పొరేషన్​ను ప్రక్షాళన చేస్తామని, వికలాంగులకు అండగా ఉంటామని ఆ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య స్పష్టం చేశారు. 40 శాతం వైకల్యం ఉన్నా పరికరాలు, త్రీ వీలర్ వెహికల్స్ ఇస్తామని ప్రకటించారు. గురువారం మలక్ పేటలోని కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన బోర్డు మీటింగ్ లో పలు నిర్ణయాలు తీసుకున్నామని ఆయన ఓ ప్రకటన రిలీజ్ చేశారు. రాష్ర్టంలో  15 నియోజకవర్గాలను ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, అక్కడి వికలాంగుల పరిస్థితులపై  అధ్యయనం చేస్తామన్నారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న గత 10 ఏళ్లలో 2 సార్లు మాత్రమే బోర్డు మీటింగ్ జరిగిందని, కార్పోరేషన్ లో భారీ అవినీతి జరిగిందన్నారు. పక్కదారి పట్టించిన వికలాంగుల నిధులపై విజిలెన్స్, ఏసీబీ విచారణ జరిపిస్తామన్నారు. రేవంత్ సర్కార్ మారుమూల ప్రాంతాల్లోని చివరి వికలాంగుడి వరకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లల్లో కార్పొరేషన్ కు రూ.64 కోట్లు కేటాయిస్తే.. రేవంత్ ప్రభుత్వం తొలి ఏడాదే రూ.50 కోట్లు కేటాయించిందని వీరయ్య పేర్కొన్నారు.