కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి : నిర్మలా జగ్గారెడ్డి

కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి : నిర్మలా జగ్గారెడ్డి
  • టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు టీజీ ఐఐసీ చైర్​పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సూచించారు. మంగళవారం సంగారెడ్డి లోని ఓ ప్రైవేట్ హోటల్​లో ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితా ఆధారంగా ఓటర్లను నేరుగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిపై వివరిస్తూ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు జూలకంటి ఆంజనేయులు, ప్రభు గౌడ్, బుచ్చి రాములు, మోతీలాల్, సంతోష్, ప్రవీణ్ ఉన్నారు.