
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై టీజీఐఐసీ కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని క్లారిటీ ఇచ్చింది. ప్రాజెక్టులో హెచ్సీయూ భూమి లేదని స్పష్టం చేసింది. 'కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి యజమాని తానేనని న్యాయస్థానం ద్వారా ప్రభుత్వం నిరూపిం చుకుంది. ప్రైవేటు సంస్థకు 21 ఏండ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయపోరాటం ద్వారా దక్కించుకుంది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో లేక్స్ లేవు. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా సెంట్రల్ యూనివర్సిటీది కాదని తేలింది. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణా ళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను దెబ్బతీయదు.
ALSO READ | ఓయూలో వీసీ వర్సెస్ ప్రొఫెసర్స్ .. గవర్నర్కు ఫిర్యాదు చేసిన ఔటా నేతలు
ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి, పర్యావరణ అవసరాల కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రాజెక్ట్ను వ్యతిరేకించే కొందరు రాజకీయ నాయకులు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 400 ఎకరాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. 400 ఎకరాలు రెవెన్యూ రికా ర్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. దీనిలో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది' అని టీజీఐఐసీ పేర్కొంది.
హెచ్సీయూలో హై అలర్ట్
హైదరాబాద్ : హెచ్సీయూలో వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో యూనివర్సిటీ మెయిన్దేట్ వద్ద సెక్యూరిటీని పెంచారు. యూనివర్సిటీ లోపల బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలంటూ విద్యార్థులు నిన్నటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా వర్సిటీ లోపలకు వెళ్లే వారి వివరాలను అడిగి తెలుసుకొ ని.. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, సిబ్బందిని మాత్రమే లోపలకు పంపిస్తున్నారు. 50పైగా జేసీబీ లతో పోలీసుల పహారా మధ్య ల్యాండచదును చేసే పనులు కొనసాగుతున్నాయి.