ఇసుక పేరుతో కేసీఆర్​ కుటుంబం రూ.7 వేల కోట్లు దోచుకుంది : ఈరవత్రి అనిల్​ కుమార్​ 

ఇసుక పేరుతో కేసీఆర్​ కుటుంబం రూ.7 వేల కోట్లు దోచుకుంది : ఈరవత్రి అనిల్​ కుమార్​ 
  • లెక్కా పత్రం లేకుండా గోల్​మాల్: ఈరవత్రి అనిల్​ కుమార్​ 

హైదరాబాద్, వెలుగు: ఇసుక అక్రమ రవాణాతో కేసీఆర్​ కుటుంబం రూ.7 వేల కోట్లు దోచుకున్నదని తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీజీఎండీసీ)  చైర్మన్​​ ఈరవత్రి అనిల్​ కుమార్​ ఆరోపించారు.  అనుమతులు లేని చోట్ల కూడా ఇసుక తోడేశారని, ఉన్నచోట ఇచ్చిన దానికంటే ఎక్కువే చేశారని పేర్కొన్నారు. వే బ్రిడ్జిలు.. వే బిల్లులు లేకుండానే ఇసుకను తరలించారన్నారు. హైదరాబాద్ లోని టీజీఎండీసీ కార్యాలయంలో ఈరవత్రి అనిల్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ఏడాదికి కోటి, కోటి 25 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటే.. ఏకంగా కోటి 75 లక్షల టన్నులు అదనంగా వెళ్లిందన్నారు. వాటన్నింటికీ లెక్కా పత్రం లేదని చెప్పారు. ఇసుకను అక్రమంగా తరలించడమే కాకుండా బ్లాక్​ మార్కెట్​లో అమ్ముకున్నారన్నారు. ఇలా రాష్ట్ర ఖజనాకు రావాల్సిన రూ.7 వేల కోట్లు.. కేసీఆర్​ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్ల మార్క్​ చేరుకున్నట్టు తెలిపారు.