సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లు, ఫీడర్ల మానిటరింగ్‌‌‌‌‌‌‌‌కు కొత్త టెక్నాలజీ

సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లు, ఫీడర్ల మానిటరింగ్‌‌‌‌‌‌‌‌కు కొత్త టెక్నాలజీ
  • కసరత్తు చేస్తున్న టీజీఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌
  • పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా చిన్నపెండ్యాల, నిడిగొండ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లు

హనుమకొండ, వెలుగు : సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లు, ఫీడర్లను రియల్‌‌‌‌‌‌‌‌ టైం మానిటరింగ్‌‌‌‌‌‌‌‌, కంట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ చేయడానికి టీజీఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ కొత్త టెక్నాలజీకి శ్రీకారం చుడుతోంది. ఒడిశాలో టాటా పవర్‌‌‌‌‌‌‌‌ వెస్ట్రన్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌ కంపెనీ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో అవలంభిస్తున్న విధానాలను ఇక్కడ కూడా అమలుచేసేందుకు కసరత్తు చేస్తోంది. కొత్త విధానంపై అధ్యయనం చేసేందుకు ఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌లోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు వి.మోహన్‌‌‌‌‌‌‌‌రావు, జి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, కె.గౌతమ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కె.అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌తో ఇప్పటికే టెక్నికల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు.

దీంతో వీరంతా ఈ నెల 11 నుంచి 12 వరకు ఒడిశాలో అమలుచేస్తున్న విధానాలపై అధ్యయనం చేశారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లలో లోడ్, పవర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టర్‌‌‌‌‌‌‌‌, ట్రిప్పింగ్స్, బ్రేక్‌‌‌‌‌‌‌‌ డౌన్స్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌సీలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు. కాగా ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ కింద స్కోప్‌‌‌‌‌‌‌‌, స్క్నైడర్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీలకు చిన్నపెండ్యాల, నిడిగొండ సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లను అప్పగించారు.

ఆయా సంస్థలు జులై ఐదు వరకు ఇక్కడి పరిస్థితిని స్టడీ చేసి, ఇచ్చే సమాచారం అనుగుణంగా టెండర్లు పిలవనున్నారు. ఈ రెండు సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్ల పనితీరును బట్టి కొత్త టెక్నాలజీని టీజీఎన్‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌ మొత్తానికి అమలు చేసేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల మానవ రహిత సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్లను డెవలప్‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.