
- మెరుగైన సేవలకు గుర్తింపుగా దక్కిన రేటింగ్
హనుమకొండ, వెలుగు: కన్స్యూమర్ సర్వీసింగ్ రేటింగ్ ఆఫ్ డిస్కమ్స్(సీఎస్ఆర్డీ)లో టీజీఎన్పీడీసీఎల్జాతీయస్థాయిలో 'ఏ' రేటింగ్ తో ఐదో ర్యాంక్ సాధించింది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సీఎస్ఆర్డీ – 2023-, 24 ర్యాంకింగ్స్ లో ఎన్పీడీసీఎల్చోటు దక్కించుకుంది.
వినియోగదారులకు సత్వర సర్వీసుల మంజూరు, మీటరింగ్, బిల్లింగ్ ప్రక్రియ స్పీడప్ , కంప్లయింట్ల పరిష్కారం, జవాబుదారీతనం, కార్యాచరణలో ముందుండడం వంటి సేవలతో జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ వచ్చినట్టు ఎన్పీడీసీఎల్సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. సంస్థ పరిధిలో వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామన్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు.