ప్రతి విద్యుత్‌‌‌‌ స్తంభానికి యూనిక్‌‌‌‌ పోల్‌‌‌‌ నంబర్‌‌‌‌

ప్రతి విద్యుత్‌‌‌‌ స్తంభానికి యూనిక్‌‌‌‌ పోల్‌‌‌‌ నంబర్‌‌‌‌

హనుమకొండ, వెలుగు: టీజీఎన్‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌ పరిధిలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు విద్యుత్‌‌‌‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌‌‌‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఎన్‌‌‌‌పీడీసీఏల్‌‌‌‌ పరిధిలో అస్సెట్‌‌‌‌ మ్యాపింగ్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌లో అన్ని 33, 11 కేవీ స్తంభాలకు యూనిక్‌‌‌‌ పోల్‌‌‌‌ నంబర్‌‌‌‌ పెయింటింగ్‌‌‌‌ ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. అస్సెట్‌‌‌‌ మ్యాపింగ్‌‌‌‌ వల్ల పోల్స్‌‌‌‌ వారీగా పెట్రోలింగ్‌‌‌‌ ఈజీ అవుతుందన్నారు.

సమస్యలు ఎదురైనప్పుడు ట్రాక్‌‌‌‌ చేయడంతో పాటు అంతరాయాలు, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ల వైఫల్యాలను గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడితే ఆ పోల్‌‌‌‌ నంబర్‌‌‌‌ ద్వారా అక్కడి లొకేషన్‌‌‌‌ మ్యాపింగ్ తెలుసుకొని, వెంటనే వెళ్లి సమస్య పరిష్కరించేందుకు వీలు ఉంటుందన్నారు.

ఇప్పటివరకు సుమారు 1,826 ఫీడర్లకు నంబరింగ్‌‌‌‌, డిజిటలైజేషన్‌‌‌‌, ప్రీ మాన్‌‌‌‌సూన్‌‌‌‌ ఇన్స్‌‌‌‌పెక్షన్‌‌‌‌ పూర్తయిందని చెప్పారు. మిగతా ఫీడర్ల ప్రక్రియను కూడా రెండు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.