మాజీ మంత్రి హరీశ్​రావు వ్యాఖ్యలను ఖండించిన టీజీఓ

ఖమ్మం టౌన్, వెలుగు :  రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, ఏసీ గదులలో కూర్చునే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమేంటని మాజీ మంత్రి హరీశ్​రావు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఖండించారు. ఖమ్మం వీడీఓఎస్ కాలనీలోని టీజీఓ ఆఫీస్​లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్​రావు రైతులకు, ఉద్యోగులకు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. 

గత ప్రభుత్వం ఉద్యోగులకు ఏనాడు ప్రతినెలా 1న జీతాలు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. రైతులకు ఉద్యోగులు ఎప్పుడు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో టీజీఓ నాయకులు నయీమ్ పాషా, రామకృష్ణ, తమ్మిశెట్టి శ్రీనివాస్, మోహన్, సతీశ్, శాస్ట్రీ, టీఎన్జీఓ నాయకులు దుర్గాప్రసాద్, రవిచంద్ర, రాధాకృష్ణ, శ్రీకాంత్, డ్రైవర్ల సంఘం లీడర్లు హకీం, పంతులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు బిక్కన్ నాయక్, అంజమ్మ, కృష్ణయ్య పాల్గొన్నారు.