Good News: టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్సీస్ ఫ‌లితాలు విడుదల

Good News: టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్సీస్ ఫ‌లితాలు విడుదల

ఉద్యోగ నియామకాల్లో TGPSC వేగం పెంచింది. బుధవారం (8 జనవరి 2025) వివిధ పరీక్షల కీ పేపర్,  ఫలితాలను విడుదల చేసి అభ్యర్థులకు సభవార్త. తాజాగా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్సీస్ ఫ‌లితాల‌ను టీజీపీఎస్సీ విడుద‌ల చేసింది. టీపీబీవో ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. 

టీపీబీవో ఉద్యోగాల‌కు 2023 జులైలో టీజీపీఎస్సీ రాత‌ప‌రీక్షలు నిర్వ హించగా 171 మంది ఎంపికయ్యారు. అభ్యర్థులు  TGPSC అఫీషియల్ వెబ్ సైట్ లో ఫలితాలను చూడగలరు.


వెబ్ సైట్: https://www.tspsc.gov.in/ 

అంతకుముందు టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-3 'కీ' విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా  మరో రెండ్రోజుల్లో గ్రూప్‌-2 'కీ' విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించారు. 

ALSO READ | గ్రూప్ 3 ‘కీ’ విడుదల చేసిన TGPSC.. గ్రూప్ 2 కీ ఎప్పుడంటే..