
గ్రూప్ 1 పోస్టుల నియామకాలకు అడ్డంకి తొలిగింది. జీవో 29ని కొట్టివేయాలని వేసిన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీం కోర్టు. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీవో 55కు సవరణ తీసుకొస్తూ జీవో 29 ను రిలీజ్ చేసింది ప్రభుత్వం. దీనిని రద్దు చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఏప్రిల్ 4న విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.
దీంతో గ్రూప్ 1 నియామకాలకు అడ్డు తొలగిపోయింది. ఇప్పటికే గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ చేసింది టీజీఎస్పీఎస్ సీ. త్వరలో 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
►ALSO READ | జాబ్ నోటిఫికేషన్స్.. బీటెక్లో ఈసీఈ చేసి ఉంటే ఈ జాబ్స్కు ట్రై చేయొచ్చు..
తెలంగాణలో తొలిసారిగా 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అప్పటి ప్రభుత్వం. 503 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చింది . 2022అక్టోబర్, 2023 ఆగస్టులో రెండు సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. ఒకసారి ప్రశ్నాపత్రం లీకేజీతో ప్రిలిమినరీ ఎగ్జామ్ రద్దు చేయగా..రెండోసారి బయోమెట్రిక్ తీసుకోని కారణంగా ఎగ్జామ్ ను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 19న 563 పోస్టులతో రేవంత్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది.