గ్రూప్ -2 పరీక్షలకు సర్వం సిద్ధం.. టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి : టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం

గ్రూప్ -2 పరీక్షలకు సర్వం సిద్ధం.. టెన్షన్ లేకుండా ఎగ్జామ్ రాయండి : టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం

డిసెంబర్ 15 నుండి రెండు రోజుల పాటు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు టీజీపీఎస్సీ (TGPSC)  చైర్మన్ బుర్ర వెంకటేశం తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపటి నుండి (డిసెంబర్ 15 ఆదివారం) గ్రూప్ 2 పరీక్షలు రెండు రోజుల పాటు జరుగుతాయని వెల్లడించారు. ఈ పరీక్షలకు 5 లక్షల 51 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నప్పటికీ.. లక్షలాది కుటుంబాలు అటాచ్ అయ్యాయని అన్నారు. అనివార్య కారణాల వల్ల గ్రూప్ 2 వాయిదా వేస్తూ వచ్చినప్పటికీ ఆదివారం నుండి రెండు రోజుల పాటు పరీక్షలు సజావుగా జరుగుతాయని వెల్లడించారు. 

1368 సెంటర్లు.. 49,840 మంది స్టాఫ్:

గ్రూప్ 2 నిర్వహణ ఆషామాషీ వ్యవహారం కాదని, 1368 సెంటర్లలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాల వద్ద 49,840 మంది స్టాఫ్  పనిచేస్తారని తెలిపారు. అదేవిధంగా పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బంది కలిపి మొత్తం 75 వేల వరకు పనిచేస్తారని అన్నారు. గ్రూప్ 2 పరీక్షలకు 75 నుంచి 80 శాతం వరకు అభ్యర్థులు హాజరవుతారని భావిస్తున్నట్లతు తెలిపారు. పరీక్ష నిర్వహణలో భాగంగా ఒక్కొక అభ్యర్థికి దాదాపు 70 మంది సిబ్బంది పనిచేస్తారని అన్నారు. 

నమ్మకం పెట్టుకోండి.. మేమున్నాం..

గ్రూప్ 2 పరీక్షలో భాగంగా మొత్తం 783 ఉద్యోగాలు భర్తీ కానున్నాయని, ఒక్క పోస్ట్ వున్నా అది మీదే అని రాయండని సూచించారు. అపోహలకు పోకుండా ఎవరిపై వారు నమ్మకం పెట్టుకొని పరీక్షలు రాయాలని, ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి తాము ఉన్నామనిని ధైర్యం ఇచ్చారు. 

సిబ్బందికి సూచనలు:

అదే విధంగా గ్రూప్ 2 పరీక్షలకు విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు చైర్మన్ బుర్రా వెంకటేశం. ఎవరి ఓఎమ్మార్ షీట్ (OMR Sheet)  వారికే ఇవ్వాలని, పక్కవారికి ఇవ్వొద్దని సిబ్బంధికి సూచించారు. ఈ పరీక్షకు బయోమెట్రిక్ ఉంటుందని, బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసే వీలుండదని తెలిపారు. 

వేగంగా ఫలితాలు అందిస్తాం

గ్రూప్ 2 నిర్వహణ ఆషామాషీ వ్యవహారం కాదని, 2015 లో గ్రూప్ -2 పూర్తీ చేయడానికి 4ఏండ్లు పట్టిందని, కానీ ఈసారి చాలా వేగంగా రిజల్ట్ ఇస్తామని అన్నారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు చాలా గ్రౌండ్ వర్క్ చేశామని, అందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి స్థాయిలో టీజీపీఎస్సీ (TGPSC) సిద్ధం చేసిందని తెలిపారు.  పరీక్ష నిర్వహణ విషయంలో ఎటువంటి అనుమానాలు అవసరం లేదని, ప్రతి సెంటర్ లో సీసీ కెకెమెరాలు వున్నాయని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూసుకుంటారని భరోసా ఇచ్చారు. 

కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశ్నాపత్రాలు

అంతే కాకుండా క్వశన్ పేపర్స్, OMR షీట్లను కట్టుదిట్టమైన భద్రతల మధ్య 58 స్టోరేజి పాయింట్స్ లో భద్రపరిచామని,  క్వశన్ పేపర్స్ ఎవరూ చేసే వీలు లేదని, చివరికి తనకు తెలియదని అన్నారు. క్వశన్ పేపర్ కేవలం అభ్యర్థి మాత్రమే చూసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తను ఇటీవలే ఛార్జ్ తీసుకున్నందున గ్రూప్ -2 పేపర్ ఎప్పుడు తయారు చేసిందో కూడా తనకు తెలియదని అన్నారు.

కేంద్ర సంస్థల అధ్యయనం కోసం ఢిల్లీ టూర్:

టీజీపీఎస్సీ (TGPSC) లో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, అందులో భాగంగా 18,19 తేదీల్లో టీజీపీఎస్సీకమిషన్ ఢిల్లీకి స్టడీ  టూర్ వెళ్తుందని తెలిపారు. వివిధ సెంట్రల్ కమీషన్లతో సమావేశం అవుతామని అన్నారు. అందులో భాగంగా18న యూపీఎస్సీ (UPSC), 19న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఆ తర్వాత సాయంత్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో భేటీ ఉంటుందని తెలిపారు. అక్కడ పరీక్షాలు ఎలా జరుగుతున్నాయి, వాటి విధివిధానాలేంటో తెలుసుకునే పనిలో వెళ్తున్నామని అన్నారు. జనవరి నుండి టీజీపీఎస్సీ (TGPSC) లో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నామని, వచ్చే నోటిఫికేషన్లు మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఈ టూర్ ఉపయోగపడుతుందని తెలిపారు.  తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక వాళ్ళు మన వద్దకి స్టడీ టూర్ కి రావడానికి సిద్ధంగా వున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Also Read :గ్రూప్​-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇక UPSC టాప్ లెవల్ జాబ్స్ మాత్రమే భర్తీ చేస్తుందని, మిగతా ఉద్యోగాలను కింది సంస్థలకు అప్పగిస్తుందని, కానీ తెలంగాణలో టీజీపీఎస్సీ (TGPSC) అన్ని రకాల పోస్టులను ఫిల్ చేస్తుందని, ఈ కారణాల వల్ల భర్తీ ఆలస్యం అవుతుందని అన్నారు. అలా కాకుండా పరీక్షలు 6 నెలలో లేదా ఏడాది లోపు పూర్తీ అయ్యేలా చర్యలు చేపట్టేందుకు పూర్తి స్థాయి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్లు తెలిపారు. జనవరి, ఫిబ్రవరిలో గ్రూప్ -1,3 ఫలితాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలిపారు.