
గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక సర్వీస్ కమిషన్. గ్రూప్ 1 ఫిజికల్ హ్యాండి క్యాప్ అభ్యర్థులకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 26 ఉదయం 10.30 నుండి అభ్యర్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుందని కమిషన్ వెల్లడించింది. నాంపల్లి లోని TGPSC కార్యాలయంలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. కమిషన్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంచారు అధికారులు.
గ్రూప్ 1 సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి కొనసాగుతోంది. 22వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత వికలాంగులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ ను చేపట్టనున్నారు. శనివారం (ఏప్రిల్ 26) టీజీపీఎస్సీ కార్యాలయంలోనే వెరిఫికేషన్ చేయనున్నారు. వెరిఫికేషన్ కు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకురావాలని ప్రకటనలో పేర్కొన్నారు. గ్రూప్1 సర్వీసెస్లో 563 పోస్టులకుగాను 1:1 రేషియోలో 563 మంది అభ్యర్థులతో షార్ట్ లిస్టును కమిషన్ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in లో పెట్టింది.