గుడ్ న్యూస్: TGPSC గ్రూప్‌-1 జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల

గుడ్ న్యూస్: TGPSC గ్రూప్‌-1 జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్ట్‌ విడుదల

ఉగాది పర్వదినాన గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ). గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు (GRL) విడుదల చేస్తూ శుభవార్త చెప్పింది. ఆదివారం (మార్చి 30) లిస్టు విడుదల చేశారు టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం. 

ఇప్పటికే ప్రొవిజనల్‌ మార్కుల జాబితా విడుదల చేసిన టీజీపీఎస్సీ .. తాజాగ  గ్రూప్ 1 ర్యాంకింగ్స్ ర్యాంకింగ్‌ లిస్ట్‌ ను అందుబాటులో ఉంచింది. ఇటీవల 563 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ.. ఉగాది సందర్భంగా ర్యాంకిగ్స్ విడుదల చేసి గుడ్ న్యూస్ చెప్పింది. 

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 పోస్టుల భర్తీ కోసం ఈ 2024 ఫిబ్రవరి 19న గ్రూప్–1 నోటిఫికేషన్ ఇవ్వగా, జూన్ 9న  ప్రిలిమ్స్ ఎగ్జామ్​ నిర్వహించారు. మార్చి 10న ఫలితాలు విడుదల చేశారు.  టీజీపీఎస్సీ పోర్టల్​లో మార్చి10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు  రీకౌటింగ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తాజాగా ర్యాంకింగ్స్ విడుదల చేసి నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేశారు.