ఇవాళే(మార్చి 10) గ్రూప్ 1 రిజల్ట్

 ఇవాళే(మార్చి 10) గ్రూప్ 1 రిజల్ట్

హైదరాబాద్, వెలుగు: టీజీపీఎస్సీ గతేడాది అక్టోబర్​లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి. అభ్యర్థికి వచ్చిన ప్రొవిజినల్ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ అధికారికంగా వెల్లడించనుంది. 

మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం 2024  జూన్ లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా.. వారిలోంచి మెయిన్స్ కు 31,403 మంది ఎంపికయ్యారు. వారికి అక్టోబర్ 21 నుంచి 27 వరకూ పరీక్షలు నిర్వహించగా.. 21,093 మంది అటెండ్​ అయ్యారు. వీరందరికీ వచ్చిన మార్కులను టీజీపీఎస్సీ సోమవారం ప్రకటించనుంది. ఈ మార్కులతో ఎవరికి జాబ్ వచ్చే అవకాశం ఉందనేది దాదాపు స్పష్టం కానున్నది. కాగా, మంగళవారం గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా రిలీజ్ కానుంది.