TGPSC Group 3 Results: తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాల విడుదల..

TGPSC Group 3 Results: తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాల విడుదల..

గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది టీజీపీఎస్సీ. నవంబర్ 17, 18న నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలు శుక్రవారం ( మార్చి 14 ) విడుదల చేసింది టీజీపీఎస్సీ. 1365 పోస్టులకు గాను జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేశారు టీజీపీఎస్సీ అధికారులు. ఈ పరీక్షలకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేయగా... 50.24 శాతం మంది హాజరయ్యారు. 

2022 డిసెంబర్ 30న గ్రూప్ 3 పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. 107 శాఖల పరిధిలో అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ ఆడిటర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైటులో ( www.tspsc.gov.in ) రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. 

గ్రూప్ 3 పరీక్షల్లో ఉతీర్ణులైన అభ్యర్థులకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు.. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన అధికారులు ఈ జాబితా ఆధారంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి మెరిట్ లిస్ట్ అనౌన్స్ చేస్తారు. ఈ లిస్ట్ లో పేరు వచ్చినవారికి నియామక పత్రాలు అందజేస్తారు.