ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్  సెలెక్షన్ లిస్టు రిలీజ్

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్  సెలెక్షన్ లిస్టు రిలీజ్

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రెండేండ్ల క్రితం నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. మొత్తం ఏడు జోన్లలోని 24 పోస్టులకు గానూ.. 24 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ పోస్టుల భర్తీకి 2022 జులై 21న టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా, దానికి 16,381 మంది అప్లై చేశారు.

పరీక్షను 2022 నవంబర్​7న నిర్వహించగా, ఈ నెల 7,8 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ క్రమంలో మంగళవారం ప్రొవిజినల్ సెలెక్టెడ్ లిస్టును కమిషన్ అధికారులు రిలీజ్ చేశారు. కాళేశ్వరం జోన్​–1లో ముగ్గురు, బాసర జోన్– 2లో ముగ్గురు, రాజన్న జోన్– 3లో ముగ్గురు, భద్రాద్రి జోన్–4లో ఐదుగురు, యాదాద్రి జోన్–5లో ముగ్గురు, చార్మినార్ జోన్– 6లో ముగ్గురు, జోగులాంబ జోన్– 7లో నలుగురిని ఎంపిక చేసినట్టు తెలిపారు.