
గ్రూప్ 1 హాల్‌టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. www.tspsc.gov.in వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు కమిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నట్టు పేర్కొంది.