హైదరాబాద్, వెలుగు: ఉమెన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్) గ్రేడ్ 1 ఖాళీల భర్తీకి ఈ నెల 6, 7 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.