
బిల్డర్ సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TGRERA) గురువారం (ఏప్రిల్ 17) నోటీసులిచ్చింది. కొంపల్లి సమీపంలోని గౌడవల్లిలోని సాకేత్ ప్రణామం అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ నిర్వహణకు సంబంధించిన అన్ని ఆదాయ వ్యయాల నెలవారీ స్టేట్ మెంట్లను , పెరిగిన వడ్డీ వివరాలు, ముందస్తు డిపాజిట్లు లేదా కార్పస్ ఫండ్ వివరాలను నోటీసు బోర్డుపై ఉంచాలని ఆదేశించింది. దీంతోపాటు నిర్మాణ సంబంధ లోపాలను సొంత ఖర్చులతో సరిచేయాలని సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను TGRERA ఆదేశించింది.
కారిడార్లలో వర్షపు నీరు లీకేజీ,విద్యుత్ సరఫరాలో అంతరాయం, సీలింగ్ లేదా వాటర్ ప్రూఫింగ్ డ్యామేజ్,ఏవైనా నిర్మాణ లేదా విద్యుత్ ప్రమాదాలు వంటి ఫిర్యాదులు ఉంటే వెంటనే సరిచేయాలని సూచించింది. ఈ ఉత్తర్వు జారీ చేసిన అరవై రోజుల్లోపు ఈ పనులను పూర్తి చేయాలని అథారిటీ బిల్డర్లను ఆదేశించింది.
సాకేత్ ప్రణామం నివాసితుల ఫిర్యాదుతో..
గౌడవల్లిలోని సాకేత్ ప్రణామం నివాసితులు, సాకేత్ ప్రణామం సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిల్డర్ సాకేత్ ఇంజనీర్స్ పై ఫిర్యాదు చేశారు. అపార్టుమెంట్ లో వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ TGRERAను ఆశ్రయించారు. గోదావరి నది నుండి లభించే త్రాగునీరు సమస్య, తరచుగా విద్యుత్తు అంతరాయం, సకాలంలో గ్యాస్ పైప్‌లైన్ కనెక్షన్లు ,లిఫ్ట్‌ల పనితీరులో లోపాలువంటి సమస్యలు ఉన్నాయని తెలిపారు. దీంతో TGRERA బిల్డర్ సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు నోటీసులిచ్చింది.
►ALSO READ | చిన్నారికి అండగా సీఎం రేవంత్ రెడ్డి..కోమాలో ఉన్న బాలిక మెరుగైన చికిత్సకు ఆదేశం