హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్(టీజీ ఆర్ఎస్ఏ) సీసీఎల్ఏ యూనిట్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీజీ ఆర్ఎస్ఏ గౌరవ అధ్యక్షుడు, ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మహిళా అధ్యక్షురాలు సుజాత చౌహాన్ సమక్షంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది.
అధ్యక్షుడిగా ఆర్.రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులుగా కె.శ్రీనివాసులు, కె.రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా ఎ.వెంకటేశ్వర్లు, గులాం ఫరూఖ్ అలీ, ఎం.వెంకటేశం, ఎం.స్వాతి, ప్రధాన కార్యదర్శిగా డీవీఎస్ఎస్ కృష్ణ చైతన్య, కోశాధికారిగా ఎం.పల్లవి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎస్వీ సుమిత్ర, డి.సందీప్, స్పోర్ట్స్ సెక్రటరీగా యశ్వంత్, కల్చరల్ సెక్రటరీగా విద్యా దీప్తి, జాయింట్ సెక్రటరీలుగా ఆర్.సురేశ్, కె.వినయ్‌కుమార్, వినీత, ఎండీ నబి, ఎస్.రమేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బి.ఉమామహేశ్వర్, సీహెచ్.ఉషారాణి, ఎండీ ఇక్రముద్ధీన్, డి.సాయినాథ్, అక్బర్ తాబ్‌రెజ్, దివ్య, ఎండీ అహ్మద్ షరీఫ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అలాగే టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కమిటీలోనూ సీసీఎల్ఏకు సముచిత స్థానానం కల్పించారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా డి.శ్రీకాంత్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా కె.మంజుల, కార్యదర్శులుగా ఎం.సంతోశ్లాల్, ఎం.సాయికృష్ణ, జాయింట్ సెక్రటరీగా పి.సురేష్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీర్ ముర్తూజ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.