దసరాకు టీజీఎస్ ఆర్టీసీ 6 వేల స్పెషల్ బస్సులు

దసరాకు టీజీఎస్ ఆర్టీసీ 6 వేల స్పెషల్ బస్సులు
  • హైదరాబాద్ శివారు నుంచే సర్వీసులు: వీసీ సజ్జనార్
  • ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు
  • నేటి నుంచి 15వ తేదీ దాకా అందుబాటులోకి..
  • ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దని ఆర్టీసీ ఎండీ ఆదేశం

హైదరాబాద్​సిటీ, వెలుగు: దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి ఆరు వేల బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ర‌‌‌‌ద్దీ దృష్ట్యా టైమ్ సేవ్ చేసేందుకు హైద‌‌‌‌రాబాద్ సిటీ శివారు ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని ప్రకటనలో తెలిపారు. ‘‘సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌‌‌‌గ‌‌‌‌ర్, ఉప్పల్, ఆరాంఘ‌‌‌‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌‌‌‌బీ త‌‌‌‌దిత‌‌‌‌ర ప్రాంతాల నుంచి స్పెష‌‌‌‌ల్ స‌‌‌‌ర్వీసులను అందుబాటులో ఉంచుతున్నం. 

ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌక‌‌‌‌ర్యార్థం గ‌‌‌‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌‌‌‌య‌‌‌‌వాడ‌‌‌‌, బెంగ‌‌‌‌ళూరు త‌‌‌‌దిత‌‌‌‌ర ప్రాంతాల‌‌‌‌కు బ‌‌‌‌స్సుల‌‌‌‌ను నడిపేలా చూస్తున్నాం’’అని సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బ‌‌‌‌స్సులు, ర‌‌‌‌ద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల‌‌‌‌కు క‌‌‌‌ల్పించాల్సిన సౌక‌‌‌‌ర్యాల‌‌‌‌పై ఆర్టీసీ అధికారుల‌‌‌‌తో ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం వర్చువల్​గా సమావేశం అయ్యారు. ప్రయాణికులను సుర‌‌‌‌క్షితంగా గ‌‌‌‌మ్యస్థానాల‌‌‌‌కు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల కృషి అభినందనీయమని తెలిపారు. నిరుడు ద‌‌‌‌స‌‌‌‌రాతో పోలిస్తే ఈ సారి మ‌‌‌‌హాల‌‌‌‌క్ష్మి ప‌‌‌‌థ‌‌‌‌కం కారణంగా ర‌‌‌‌ద్దీ ఎక్కువ‌‌‌‌గా ఉండే అవ‌‌‌‌కాశ‌‌‌‌ముంద‌‌‌‌ని, గతంలో మాదిరిగానే ప్రయాణికుల రాక‌‌‌‌పోక‌‌‌‌ల‌‌‌‌కు ఇబ్బందులు కల్గకుండా చ‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌ని ఆదేశించారు.

షామియానాలు, తాగునీరు ఏర్పాటు చేయండి

‘‘అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నం. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నం. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున.. 9, 10, 11వ తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. 

ఈ రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులు నడపాలి. ఎన్‌‌‌‌హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు ఏర్పాటు చేయాలి’’అని అధికారులను సజ్జనార్ ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్ రూట్​లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు వినియోగించుకోవాలని సూచించారు. స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం త‌‌‌‌మ కాల్‌‌‌‌ సెంటర్‌‌‌‌ నంబర్లు 040 – 69440000, 040–23450033ను సంప్రదించాల‌‌‌‌ని తెలిపారు.