హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో తొలి ఎలక్ట్రిక్ బస్సులు: టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో తొలి ఎలక్ట్రిక్ బస్సులు: టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్

కరీంనగర్: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రికల్ బస్సులను కరీంనగర్ లో తొలిసారి ప్రారంభించిన్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు.. వారికి సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తు్న్నారు. కరీంనగర్ కు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేశాం.. మొదట విడతగా 33 బస్సులు ప్రారంభించామన్నారు. 

కాలుష్య రహిత నగరాలే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో మొత్తం 41 సీట్లు ఉంటాయి. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కలిగి ఉంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ సిటీ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుపుతామని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 

ASLO READ : రోడ్డెక్కిన 35 ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు