టికెట్లు కొట్టడం కష్టమైతుంది..మహిళలకు స్పెషల్ పాసులివ్వండి

టికెట్లు కొట్టడం కష్టమైతుంది..మహిళలకు స్పెషల్ పాసులివ్వండి
  • మహిళలకు స్పెషల్​ పాసులు ఇవ్వండి
  • బస్సుల్లో టికెట్లు కొట్టడం ఇబ్బంది అవుతోంది 
  • ప్రయాణికుల రద్దీని తట్టుకోలేకపోతున్నాం
  • టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ‘మహాలక్ష్మి’ పథకం అమలులోని సమస్యలను పరిష్కరించాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్  కోరింది. గురువారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, ఐఎఫ్​టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు, ఐఎఫ్​టీయూ కార్యదర్శి ప్రవీణ్ పాల్గొని మాట్లాడారు. 

మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని, టికెట్లు కొట్టడానికి ఇబ్బందిగా ఉందన్నారు. దీనికి బదులు మహిళా ప్రయాణికులకు ప్రత్యేక పాసులివ్వాలన్నారు.  లేకపోతే రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచాలని కోరారు. 

బస్సు రూట్​కు ఇస్తున్న టైం రెండు గంటలైతే రష్​తో తమకు మూడు గంటలు పడుతోందన్నారు. రన్నింగ్​టైం పెంచాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న మహిళా ప్రయాణికులకు తగ్గట్టుగా బస్సులు పెంచాలన్నారు.