10 మంది టీజీఎస్పీ  కానిస్టేబుల్స్ డిస్మిస్

10 మంది టీజీఎస్పీ  కానిస్టేబుల్స్ డిస్మిస్

హైదరాబాద్, వెలుగు: పోలీస్ మ్యాన్యూవల్ కు విరుద్ధంగా ఆందోళనలు చేసిన 10 మంది టీజీఎస్పీ కానిస్టేబుళ్లను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. విధుల్లో క్రమశిక్షణను ఉల్లంఘించి ఆందోళనలు, రెచ్చగొట్టినందుకుగాను డ్యూటీ నుంచి తొలగిస్తున్నట్లు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మూడో బెటాలియన్ లో ఒకరు, ఆరో బెటాలియన్ లో ఒకరు, 12వ బెటాలియన్ లో ఇద్దరు, 17 బెటాలియన్ లో ఆరుగురు కానిస్టేబుళ్లను సర్విస్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు. పోలీస్ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలు చేయడం, న్యూస్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేసి ఆందోళనలను ప్రేరేపించడం ఆర్టికల్ 311కు విరుద్ధమని వివరించారు.