- ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ
ఇబ్రహీంపట్నం, వెలుగు: టీజీఎస్పీ హఠావో – ఏక్ పోలీస్ బనావో అంటూ ఇబ్రహీంపట్నంలో బెటాలియన్ పోలీసులు ఆదివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు, బ్యానర్ తో నిరసన తెలిపారు.
తెలంగాణలో కూడా వేరే రాష్ట్రాల మాదిరిగా టీజీఎస్పీని మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరారు. వెంటనే సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లును విధుల్లోకి తీసుకోవాలన్నారు.