TGSPSC: గ్రూప్ 3 ఎడిట్ ఆప్షన్..లాస్ట్ డేట్ సెప్టెంబర్ 6

గ్రూప్ 3 ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇదే చివరి అవకాశం..అప్లికేషన్లలో ఏవైనా సవరణలు ఉంటే ఆన్ లైన్ లో దరఖాస్తు ఫారం దిద్దుబాటుకు గడువు ఒకరోజు మాత్రమే మిగిలిఉంది..సెప్టెంబర్6తో గ్రూప్ -3 ఎడిట్ ఆప్షన్ గడువు ముగుస్తుంది..కాబట్టి దరఖాస్తు ఫారంలో ఏవైన సవరణలు ఉంటే వెంటనే ఆన్ లైన్ ద్వారా దిద్దుబాటు చేసుకోవాలి. 

అభ్యర్థులు పేరు, జెండర్, పుట్టిన తేది, సంఘం, నాన్ క్రీమీలేయర్ స్థితి,  PWD కేటగిరీ, వైకల్యం  శాతం, స్కైబ్/కాంపెన్సేటరీ సమయం , స్థానికత, స్పోర్ట్ కోటా వంటి వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకొని తప్పులుంటే సరిదిద్దుకోవాలి.