తెలంగాణ ఆర్టీసీలో కాసుల పంట పండింది. బతుకమ్మ , దసరా పండుగల సందర్భంగా కోట్ల ఆదాయం వచ్చింది. బతుకమ్మ దసరా సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు పబ్లిక్. దీంతో అక్టోబర్ 1 నుంచి 15 తేదీ వరకు 7 కోట్లకు పైగా మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.
దీంతో ఆర్టీసీకి రూ.307.16 కోట్ల ఆదాయం వచ్చింది. రెగ్యులర్ గా తిరిగే సాధారణ సర్వీసులు కాకుండా 10 వేల513 అదనంగా నడిచాయి. ఈ ఏడాది మహాలక్ష్మి ఉచిత బస్సు సర్వీస్ కూడా మహిళలకు ఉండటంతో ఆర్టీసీకి కూడా బాగా కలిసి వచ్చింది .