సంక్రాంతి పండుగకు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుక టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. సంక్రాంతి పండుగకు 6432 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 10 నుంచి నడుపుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు అవసరమైతే ఆర్టీసీ మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉందని ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి మేజర్ బస్ స్టేషన్ దగ్గర ప్రత్యేక అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సుల్లో అదనంగా మహిళలు వచ్చే అవకాశం ఉందని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎక్కడ ఇబ్బందులు కలిగించవద్దని అధికారులను ఆదేశించారు.
Also Read :- హైదరాబాద్ పోలీసుల భారీ ఆపరేషన్
మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సంక్రాంతి పండగ పూట ప్రయాణికులను అదనపు చార్జీల పేరుతో దోపిడికి గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న చార్జీలనే వసూలు చేయాలని అదనంగా వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అదనంగా వసూలు చేస్తే ప్రయాణికులు రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణికులకు సూచించారు. అధికారులు ఫీల్డ్ లోనే ఉండాలని నిరంతరం తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. అదనపు చార్జీలు వసూలు చేసినట్లు తమ దృష్టికి వస్తే బస్సులు సీజ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమనికే ప్రాధానత్య కల్పిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. ప్రయాణికులు పండగ సమయంలో జాగ్రత్తగా గమ్య స్థానాలకు వెళ్లాలని సూచించారు.