హైదరాబాద్ టూ బెంగళూరు బస్ టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్..

హైదరాబాద్ టూ బెంగళూరు బస్ టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్..

తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు రూట్లో వెళ్లే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బెంగళూరుకు నడిచే అన్ని సర్వీసులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ తో ప్రతి ప్రయాణికుడు 100 నుంచి 160 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. 

బెంగళూరు రూట్లో తిరిగే బస్సు సర్వీసులలో ప్రయాణికులకు 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. అందుకోసం ఆర్టీసీ అఫీషియల్ వెబ్ సైట్ www.tgsrtcbus.in లో టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. 

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సులలో  డిస్కౌంట్లు:

ఏసీ స్లీపర్ (బెర్త్)  టికెట్ ధర రూ.1596 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ.1412 కు తగ్గనుంది. 

ఏసీ స్లీపర్ - సీటర్ టికెట్ ధర రూ.1203 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1083

రాజధాని టికెట్ ధర రూ.1203 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1083

నాన్ ఏసీ స్లీపర్ - సీటర్ టికెట్ ధర రూ.1160 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 1044

నాన్ ఏసీ - సీటర్ టికెట్ ధర రూ.951 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ. 856

సూపర్ లక్జరీ టికెట్ ధర రూ. 946 ఉండగా డిస్కౌంట్ తర్వాత రూ.851 రూపాయలకు తగ్గుతుంది.

మిగతా డీటైల్స్ కోసం ఆర్టీసీ అఫీషియల్ వెబ్ సైట్ www.tgsrtcbus.in సంప్రదించండి.