రన్నింగ్ లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.. జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం

రన్నింగ్ లో ఊడిన ఆర్టీసీ బస్సు టైర్లు.. జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం

జగిత్యాల మండలం మోరపల్లి  దగ్గర  ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు  జగిత్యాల నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా మోరపెళ్లి గ్రామ శివారు దగ్గర ఒక్కసారిగా బస్సు వెనుక  టైర్లు ఊడిపోయి చెట్ల పొదల్లోకి వెళ్లాయి.

  దీంతో  వాహనం అదుపు తప్పి అక్కడే నిలిచి పోవడంతో కొద్దీ సేపు ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు.  ఎవరికీ ఏలాంటి గాయాలు కాకపోవడం ఊపిరి పీల్చుకున్నారు.  ప్రమాద సమయంలో బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు స్థానికుల తెలిపారు.   ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.