TGSRC: సికింద్రాబాద్ - చర్లపల్లి రైల్వే టెర్మినల్..10 నిమిషాలకో బస్సు

కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి పలు ప్రధాన రూట్లకు  TGSRTC కొత్త బస్ సర్వీస్ లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.   సికింద్రాబాద్, బోరబండ, ఉప్పల్ రింగ్ రోడ్,  వంటి ప్రధాన ఏరియాల నుంచి చర్లపల్లి రైల్వే టైంకు ఆర్టీసీ బస్సుల సర్వీసులు అందుబాటులో ఉండన్నాయి.

 సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ నుంచి  చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ఫ్లాట్ ఫారమ్ 1 వరకు ప్రతి రోజు  తెల్లవారుజామున 4.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకు ప్రతి 10  నిమిషాలకోసారి  హబ్సిగూడ, నాచారం , మల్లాపూర్ మీదుగా ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉండనుంది. 

చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్లాట్ ఫారమ్ నెం. 9 నుంచి బోరబండ వరకు చెంగిచెర్ల,  ఉప్పల్, రామంతపూర్ నుంచి ప్రతి 40  నిమిషాలకోసారి ఆర్టీసీ బస్సులు ఆపరేట్ చేస్తున్న ట్లు అధికారులు తెలిపారు.

ALSO READ | సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు

ఈ రెగ్యులర్ ఆపరేషన్‌తో పాటు, ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్లాట్ ఫారమ్ నెం.9 వరకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లు బయలుదేరే .. వచ్చే సమయానికి  అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.