ఏపీ తెలంగాణలో భారీ వర్షాలకు జనజీవనం స్తంభించి పోయింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం,విజయవాడ,మహబూబాబాద్ లోని చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ విజయవాడ మధ్య సెప్టెంబర్ 1నరాత్రి వరకు 877 బస్సులు రద్దు చేయగా.. ఇవాళ మరో 570 బస్సులను రద్దు చేసింది టీజీఎస్ఆర్టీసీ. ముఖ్యంగా వరద ఉదృతి ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ జిల్లాలో 150,రంగారెడ్డి జిల్లాలో 70 కిపైగా వాహనాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకకటించారు. వరద ఉదృతి తగ్గిన తర్వాత మళ్లీ నడుపుతామని చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా దారి మళ్లించారు.
ALSO READ | తెలుగు రాష్ట్రాల్లో రైల్వే వ్యవస్థ అస్తవ్యస్తం: 432 రైళ్లు రద్దు.. 139 దారి మళ్లింపు
మరో వైపు కొన్ని చోట్ల రైలు పట్టాలపై నీళ్లు నిలిచాయి.. మరికొన్ని చోట్ల రైలు పట్టాలపై నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రైలు రాకపోకలు దాదాపు బంద్ అయ్యాయి. రెయిన్ ఎఫెక్ట్‌తో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఇప్పటి వరకు ఏకంగా 432 రైలు సర్వీసులను రద్దు చేసింది. మరో 139 రైలు సర్వీసులను దారి మళ్లించి.. మరో 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. భారీ వర్షాలు, వరదలు వల్ల కొన్ని ప్రాంతాలు రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైళ్లను క్యాన్సిల్ చేసిటనట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.