TGSRTC:తార్నాక టీజీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిలో లేజర్ సర్జరీ

TGSRTC:తార్నాక టీజీఎస్ ఆర్టీసీ ఆస్పత్రిలో లేజర్ సర్జరీ

హైదరాబాద్: తార్నాక TGSRTC ఆస్పత్రిలో అధునాతన వైద్య సేవలు  ప్రారంభించారు. సోమవారం (జూలై 8) లేటెస్ట్ ఎక్విప్ మెంట్లతో సర్జరీ చేశారు డాక్టర్లు. ఆర్టీసీ సిబ్బందికి అడ్వాన్స్ డ్ లేజర్ సర్జరీలను చేసేందుకు కొత్త పరికరాలను  కొనుగోలు చేశారు.  డ్రైవర్లు, కండక్టర్లకు వెరికోస్ వెయిన్స్, పైల్స్ కు ఈ పరికరాలతో సర్జరీ చేస్తున్నారు. ఈ లేజర్ సర్జరీలతో సాధారణ చికిత్సల కన్నా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్యులు.  

జర్ సర్జరీ ద్వారా నొప్పి, బాధ తక్కువగా ఉంటుం దంటున్నారు. ఈ శస్త్ర చికిత్సతో త్వరగా కోలుకుంటారని డాక్టర్లు చెబుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్యంపై  టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. ఇటీ వల తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిగా అప్ గ్రేడ్ చేశారు. 

అందులో అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో నాలుగు థియేటర్ మాడ్యులర్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, లాపరోస్కోపిక్ పరికరాలు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, డయాలసిస్ యూనిట్లను ఏర్పాటు చేశారు.