నాడ హబ్బ దసరా ఉత్సవాలు కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

నాడ హబ్బ దసరా ఉత్సవాలు కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నాడ హబ్బ దసరా ఉత్సవాలు కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతాయని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కాచిగూడలో కర్నాటక సాహిత్య మందిర ఆధ్వర్యంలో నాడ హబ్బా దసరా ఉత్సవాలు బుధవారం ఘనంగా జరిగాయి. వేడుకలకు సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కన్నడ సంస్కృతి పరిరక్షణకు కర్నాటక సాహిత్య మందిర ఎంతో కృషి చేస్తోందన్నారు.

సిటీలోని 10 లక్షల కన్నడిగులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏటా 9 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. వేడుకల్లో ప్రముఖ కన్నడ జానపద కళాకారులు కేఎస్ మంజునాథ్,  రాజ్ గురు హోస్కొటే  గీతాలాపన ఆకట్టుకుంది. సాహిత్య మందిర అధ్యక్షుడు సురేంద్ర కట్గెరి, కార్యదర్శి నర్సింహా మూర్తి జొయ్స్, రిటైర్డ్ జడ్జి సుదింద్ర కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.