పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సీరియస్​

పాపులారిటి కోసం వికృత చేష్ఠలు.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ సీరియస్​

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు యువకులు వెర్రి పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వెర్రి చేష్టలు చేసిన ఓ యువకుడిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం కొందరు యువకులు చిల్లర చేష్టలు చేస్తున్నారు. వారి పనుల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రీల్స్ చేయడం కోసం కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా అని ప్రశ్నించారు.

సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. అందులో ఓ యువకుడు బస్సును ఆపి.. ఎక్కుకుండా పారిపోతాడు. దానిపై సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!?. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు. లైక్‌లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి' అని సజ్జనార్ హితవు పలికారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.