ఆ వార్తలు అవాస్తవం.. టికెట్ ధరల పెంపుపై స్పందించిన సజ్జనార్

ఆ వార్తలు అవాస్తవం.. టికెట్ ధరల పెంపుపై స్పందించిన సజ్జనార్

బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండుగ నేప‌థ్యంలో టీజీఎస్ఆర్టీసీ విప‌రీతంగా టికెట్ ధ‌ర‌లు పెంచింద‌ని జ‌రుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. జీవో ప్రకారం స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే చార్జీల‌ను సంస్థ స‌వ‌రించిందని, రెగ్యుల‌ర్ స‌ర్వీస్‌ల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.

పండ‌గ స‌మ‌యాల్లో జీవో ప్రకారం స్పెష‌ల్ స‌ర్వీసుల్లో టికెట్ ధ‌ర‌లను సవరించడం జ‌రుగుతుంద‌ని టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం స్పష్టం చేసింది. సాధార‌ణ రోజుల్లో టికెట్ ధ‌ర‌లు య‌థావిధిగా ఉంటాయని వెల్లడించింది.  జీవో.. ఆ వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని పేర్కొంది. 

" ప్రస్తుతం టీజీఎస్ఆర్టీసీలో 9 వేల‌కు పైగా బ‌స్సులు సేవ‌లందిస్తున్నాయి. పండుగ స‌మ‌యాల్లో ర‌ద్దీకి అనుగుణంగా ప్రతి రోజు స‌గ‌టున 500 స్పెష‌ల్ బ‌స్సులను సంస్థ న‌డుపుతోంది. ఆ 500 స్పెష‌ల్ బ‌స్సుల్లో మాత్రమే చార్జీల సవరణ ఉంటుంది. మిగ‌తా 8500 రెగ్యుల‌ర్ స‌ర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండ‌దు.." అని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ASLO READ | ముంబై వెళ్లేవారికి గుడ్ న్యూస్ : ఫ్రీగా ప్రయాణించండి.. టోల్ ఫీజు లేదు..