హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల ఫుట్ బోర్డు ప్రయాణంపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఇటీవల TGSRTC కి చెందిన బస్సుల్లో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయానం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా యాజమాన్యం దృష్టికి రావడంతో విద్యార్థులకు హెచ్చరికలు చేస్తూ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
#TGSRTC కి చెందిన ఒక బస్సులో కొందరు విద్యార్థులు ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా యాజమాన్యం దృష్టికి వచ్చాయి. రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీకి అనుగుణంగా బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు… pic.twitter.com/mdaTzHxCl6
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) October 22, 2024
రాష్ట్రంలో ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీకి అనుగుణంగా బస్సులను ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. అయినా కొన్ని రూట్లలో విద్యార్థుల రద్దీ వీపరీతంగా ఉంటున్నారు. విద్యార్థులు ఫుడ్ బోర్డు ప్రయాణం చేస్తున్నారు. ఇది మంచిది కాదు.. ప్రాణాలకే ప్రమాదం.. ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దని విద్యార్థులరు హెచ్చరించారు ఎండీ సజ్జనార్.
ALSO READ | హైదరాబాద్లో సేఫెస్ట్, కన్వీనెంట్ ప్రయాణానికి ఏదీ బెటర్..Chat GPT ఏం చెబుతుందంటే..
రద్దీ ఎక్కువగా ఉండే ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని యాజమాన్యం ఇప్పటికే నిర్ణయించాం.. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టాం. విద్యార్థులను క్షేమం గా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు ఎండీ సజ్జనార్.
ప్రతిరోజు లక్షలాది మంది విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లోనే గమ్యస్థానాలకు చేరుతున్నారు. విద్యార్థులకు రవాణ పరంగా ఇబ్బందుల్లేకుండా తగినన్ని బస్సుల ఏర్పా టుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ ప్రమాదాలు జరగకుండా ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ.. విద్యార్థులకు సూచించారు.