ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు..చస్తే బాధలు పోతాయా?: సజ్జనార్

ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు..చస్తే బాధలు పోతాయా?: సజ్జనార్

హైదరాబాద్: కష్టం వచ్చిందని క్షణికావేశంలో ప్రాణాన్ని తీసుకోని ఏం సాధిస్తామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి పవన్ (30) ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని అత్తాపూర్లో ఉంటున్న పవన్  ఏప్రిల్ 17న సాయంత్రం స్నేహితులు లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఘటనపై వీసీ సజ్జనార్ ట్విట్టర్ లో స్పందించారు.  వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వొద్దు. బలవన్మరణాలు చేసుకుంటే కష్టాలు, బాధలు పోతాయా? అయినవాళ్లందరిని వదిలి ఇలా హఠాత్తుగా వెళ్లిపోయాలనే ఆలోచన మంచిది కాదు. చనిపోవడానికి ఒక్కటే కారణం కానీ, బతకడానికి 1000 కారణాలు ఉంటాయని తెలుసుకోండి. బలవన్మరణాలు వద్దు.. బతికి సాధించడమే ముద్దు. అని వీసీ సజ్జనార్ ట్వీట్ చేశాడు