హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ ఉన్నవారికి ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని సోమవారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. మెట్రో ఎక్స్ ప్రెస్ తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్ఫక్ బస్ పాస్ ఉన్నవారు ఈ రాయితీని పొందవచ్చన్నారు. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుందన్నారు.
‘‘హైదరాబాద్ లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులు ఉన్నాయి. వారిలో చాలా మంది వారాంతపు సెలవుల్లో సొంతూళ్లకు వెళ్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బస్ పాస్ హోల్డర్ల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని ప్రకటించాలని నిర్ణయించాం” అని సజ్జనార్ వివరించారు.
హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త!! తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ… pic.twitter.com/QINAoc8HlA
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) November 11, 2024