
- 3,038పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తం: పొన్నం
- నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచన
హైదరాబాద్, వెలుగు: టీజీఎస్ ఆర్టీసీలో 3,038 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, త్వరితగతిన నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవడం హర్షణీయమని పేర్కొన్నారు.
పోస్టుల వివరాలు
- డ్రైవర్లు : 2000
- శ్రామిక్ : 743
- డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్): 84
- డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్): 114
- డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 25
- అసి స్టెంట్ మెకానికల్ ఇంజినీర్: 18
- అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) :23
- సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
- అకౌంట్ ఆఫీసర్స్ :6
- మెడికల్ ఆఫీసర్స్ జనరల్ :7
- మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్: 7
నిరుద్యోగులు ప్రిపేర్ కావాలి
ఇప్పటికే ప్రజాప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ దాదాపు 60 వేలకు పైగా గవర్నమెంట్ జాబ్స్ ను భర్తీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల -చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవాలని, బాగా ప్రిపేర్ అయి ఉద్యోగాలు సాధించాలని నిరుద్యోగులకు ఆయన సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నదని.. ఇప్పటివరకు ఆర్టీసీలో 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, వారికి రూ.5.500 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు.
మహాలక్ష్మి స్కీమ్ కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని, త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుందని చెప్పారు. ఆర్టీసీలో సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యో గాల భర్తీ జరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగాలను భర్తీ చేయాలని భావించిన ప్పుడు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కొనసాగుతుండ టంతో నోటిఫికేషన్ ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో త్వరలోనే జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు