టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. హైదరాబాద్‌,  వరంగల్‌లోని #TGSRTC ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.  అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ (https://iti.telangana.gov.in/) లో దరఖాస్తు చేసుకోవాలి. మోటార్‌ మెకానిక్‌ వెహికిల్‌, మెకానిక్‌ డిజిల్‌, వెల్డర్‌, పెయింటర్‌ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. 

స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరం లాంటివి. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను సంస్థ ఏర్పాటు చేసింది. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే తరగతులను నిర్వహిస్తోంది. 

ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్‌ ఐటీఐ కళాశాల ఫోన్‌ నంబర్లు 9849425319, 8008136611ను సంప్రదించవచ్చు.  పూర్తి వివరాలను https://iti.telangana.gov.in/ వెబ్‌సైట్‌లోనూ చూడొచ్చు.