ఆర్టీసీ డిపోలు ప్రైవేట్‌ పరమంటూ ప్రచారం.. స్పందించిన యాజమాన్యం

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోలను ప్రైవేట్‌ పరం చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొందరు చేస్తోన్న ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి సంస్థ తీసుకొస్తోందని పేర్కొంది. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతో సహా అన్ని బస్సుల ఆపరేషన్స్‌ నిర్వహణ పూర్తిగా టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని వెల్లడించింది. ఈ మేరకు సదరు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ పోస్టును పంచుకున్నారు.