- రాఖీ పండుగ నాడు రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు
- ఆర్టీసీకి రూ.32కోట్ల ఆమ్లానీ
- సంస్థ సిబ్బందికి మంత్రి పొన్నం అభినందనలు
హైదరాబాద్ వెలుగు: రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ఆర్టీసీ) రికార్డు స్థాయిలో సోమవారం ఒక్కరోజే 63.86 లక్షల మంది ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరవేసిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. మహాలక్ష్మి స్కీం కింద ఒక్కరోజులోనే 41.74 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని విని యోగించుకున్నారని తెలిపారు. మరో 21. 12 లక్షల మంది ప్యాసియర్లు టికెట్లు కొని బస్సుల్లో ప్రయాణంచే శారన్నారు. దీంతో ఆర్టీసీకి ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఇందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17కోట్లు, నగదుటికెట్ల ద్వారా రూ. 15 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారు లు తెలిపారు ఆర్టీసీ చరిత్రలోనే ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఇన్ కం రావడం ఇదే మొదటిసారి అని ప్రకటించారు.
పండుగ రోజు భారీ వర్షం కురిసినా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర వేసిన ఆర్టీసీ సిబ్బందిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. ఆర్టీసి మొత్తం సామర్ధ్యా న్ని ఉపయోగించుకుందని, ఉద్యోగులు రాత్రి, పగలు క్రమించారని కొనియాడారు. క్షేత్రస్థాయి సిబ్బందితో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని రద్దీ ఉన్న రూట్లలో బస్సులు అదనంగా నడి పించడం వల్లే ఇంత మంది ప్రయాణికులను గమ్యస్థా నాలకు చేరవేయడం సాధ్యమైందన్నారు.
ఆర్టీసీ డ్రైవ్ ర్లు. కండక్టర్లకు కూడా ఫీల్డ్ లోనే బస్సుల్లో వారి సొరదీ మణులు రాఖీలు కట్టారని, వారందరికీ అభినందనలు తెలిపారు. మహాలక్ష్మి పథకంద్వారా ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి చెప్పారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి తమ సోదరు. లకు రాఖీ కట్టారని, వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
92. డిపోల్లో 100% పైగా ఓఆర్ సజ్జనార్ రక్షా బంధన్ రోజు రికార్డ్ స్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని సంస్థ ఎండీ. వీసీ సజ్జనార్ కూడా అభినందించారు. రక్షా బంధన్ సందర్భంగా టీజీఎస్ ఆర్టీసీబస్సులు రికార్డ్ స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. రోజూ యావరేజ్ గా 33 లక్షల కి.మీ. తిరుగుతుండగా సోమవారం 5 లక్షల కి.మీ అదనంగా తిరిగాయి.
మొత్తం 63 లక్షల మంది ప్రయాణించారు. రీజి యన్లవారీగా చూస్తే.. హైదరాబాద్ లో 1291 లక్షలు. సికింద్రాబాద్ లో 11.68 లక్షలు, కరీంన గర్ లో 6.37 లక్షలు, మహబూబ్ నగర్ లో 5.84 లక్షలు, వరంగల్ 5.82 లక్షల మంది ప్రయాణం చేశారు. 97 డిపోలకుగాను 92 డిపోలు 100శా తానికి పైగా అక్కు పెన్సీ రేషియో (ఓఆర్) నమోదు చేశాయి" అని సజ్జనార్ తెలిపారు.
మహిళలకు 17 కోట్లు ఆదా మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ నాడు మహిళు రికార్డు స్థాయిలో ఉచిత బస్సు ప్ర యాణాన్ని వినియోగించుకున్నారని మహిళా. శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఓ ప్రకటనను విడుదల చేశారు. రాఖీ పండుగ సందర్భంగా మొత్తం 41.74లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేయగా, వారికీ రూ.17కోట్లు అయ్యిందని తెలిపారు. ఇవి రాఖీ రోజు రేవంత్ సర్కార్ రాష్ట్ర మహిళలకు ఇచ్చిన కానుకగా సీతక్క పేర్కొన్నారు. మహాలక్ష్మీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సమర్థవంతం గా అమలు చేస్తున్నందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ సిబ్బందిని మంత్రి సీతక్క అభినందించారు.